తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రెండేళ్ల బాలుడు అదృశ్యం.. రెండు గంటల్లో ఛేదించిన పోలీసులు - boy missing in jeedimetla

రెండేళ్ల బాలుడు అదృశ్యమైన సంఘటన హైదరాబాద్​ జీడిమెట్ల పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. దాదాపు రెండు గంటల్లోనే పోలీసులు బాలుడి ఆచూకీ కనుగొన్నారు.

jeedimelta police found a boy who went missing
జీడిమెట్లలో రెండేళ్ల బాలుడు అదృశ్యం.

By

Published : Nov 2, 2020, 2:05 PM IST

హైదరాబాద్​ జీడిమెట్ల పీఎస్​ పరిధిలోని సుభాశ్​ నగర్ ప్రాంతంలో అజయ్ కుమార్, అనిత దంపతులు నివాసముంటున్నారు. తమ ఇద్దరి పిల్లలతో శాపూర్​నగర్​లో ఉన్న ఏసియన్ పెయింట్స్​ షాపులో భార్యకు ఉద్యోగం అడగడానికి తమ సొంత అటోలో వెళ్ళారు. షాపు ముందు ఆటో ఆపి భార్యాభర్తలు లోనికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేలో సరికి ఆటోలో చిన్న కుమారుడు అంబరీశ్​(2) అటోలో కనబడలేదు.

చుట్టుపక్కల ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయేసరికి అజయ్ కుమార్, అనితలు జీడిమెట్ల పీఎస్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, 4 బృందాలుగా విడిపోయి బాలుని కోసం గాలించారు. రెండు గంటలలోనే బాబు ఆచూకీని శాపుర్ నగర్​లో కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details