తెలంగాణ

telangana

By

Published : Feb 22, 2019, 9:31 AM IST

ETV Bharat / jagte-raho

జయరాం కేసు రోజుకో మలుపు...

ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. గురువారం ఎనిమిది మందిని విచారించి కీలక సమాచారం సేకరించారు.

జయరాం

జయరాం కేసు రోజుకో మలుపు...

చిగురుపాటి జయరాం హత్యకేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. గురువారం 8 మందిని విచారించారు. ఈ కేసులో మొత్తం 60 మందిని ప్రశ్నించారు. ఈ హత్యతో సంబంధం ఉన్నవారిని శుక్రవారం అరెస్ట్​ చేసే అవకాశం ఉంది.
'రాకేశ్​ రెడ్డి భూ దందాలపై'
ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి వ్యాపార భాగస్వాములు, స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు. రాకేష్‌తో కలిసి భూదందాలు చేసిన కుత్బుల్లాపూర్‌కు చెందిన ముగ్గురు స్థిరాస్తి వ్యాపారులను డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ సమక్షంలో ప్రశ్నించారు.
రౌడీషీటర్ నగేశ్​ పాత్రేంటి..?
రౌడీషీటర్‌ నగేశ్​ను కూడా పోలీసులు ప్రశ్నించారు. జయరాం హత్య జరిగినట్టు తెలిసిన పోలీసులకు ఎందుకు చెప్పలేదు, నిందితుడితో కలిసి ఎలాంటి అక్రమాలకు చేశారనేదనిపై ఆరా తీశారు. నగేశ్​, అతని మేనల్లుడు విషాల్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్​ చేసే అవకాశం ఉంది.
శిఖా చౌదరితో పాటు ఏసీపీ మల్లారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌లను మరోసారి పోలీసులు విచారించాలని భావిస్తున్నారు. ఈ నెల 23తో నిందితులు రాకేష్‌రెడ్డి అతని డ్రైవర్‌ శ్రీనివాస్‌కు పోలీస్‌ కస్టడీ ముగియనుంది.ఇవీ చదవండి:పోలీసుల పాత్రపై ఆరా

ABOUT THE AUTHOR

...view details