జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని వరంగల్ కమిషనరేట్ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఓ వ్యక్తిని బెదిరించడానే కారణంతో వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ పోలీస్ స్టేషన్లో ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. రెండు నెలల పాటు రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలించారు.
జంగా రాఘవరెడ్డికి 5 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ - janga raghava reddy news
జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని వరంగల్ పోలీసులు.. జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆయనకు 5 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు.
జంగా రాఘవరెడ్డి, జనగామ
ఈ క్రమంలో గురువారం రాత్రి తన స్వగామ్రానికి వచ్చిన ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం హన్మకొండలోని జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. బెయిల్ కాపీ అందకపోవడంతో 5 రోజుల పాటు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టుకు జిల్లా కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఇదీ చదవండి:జనగామ కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్ట్