ఓఎంసీ కేసులో జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయాలని ఈడీని కోరినట్లు గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఓఎంసీ కేసులో నమోదైన అన్ని కేసులను కర్ణాటక హైకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు.
ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఇవ్వాలని అడిగాను: గాలి - undefined
సుప్రీంకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేసి తన వెయ్యికోట్ల ఆస్తులను విడుదల చేయాలని గాలి జనార్దన్ రెడ్డి కోరారు. ఓఎంసీ కేసులో ఈడీ జప్తు చేసిన ఆస్తులను తనకు విడుదల చేయాలని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
gali-janardhan-reddy
"ఈడీ జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయాలని కూడా కర్ణాటక హైకోర్టు చెప్పింది. కర్ణాటక హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కర్ణాటక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. వెయ్యి కోట్ల విలువైన ఆస్తులను విడుదల చేయడంలో ఈడీ జాప్యం చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఈడీ వెంటనే అమలు చేయాలి. ఈడీ తీరుపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా."
- గాలి జనార్దన్‌రెడ్డి
TAGGED:
gali janardhan reddy