హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్సారీ రోడ్ వద్ద ఈ నెల 5 అర్థరాత్రి జరిగిన జాడో జావిద్ హత్య కేసును ఫలక్‌నుమా పోలీసులు ఛేదించారు.
తండ్రిని దొంగ అని అన్నందుకే జాడో జావిద్ హత్య : పోలీసులు ఐదులో ఇద్దరు మైనర్లు..
ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ప్రధాన నిందితుడు జమీల్ ఖురేషి తండ్రిని జాడో జావిద్ దొంగ అని అన్నందుకే ఈ హత్య జరిగినట్లు దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ వెల్లడించారు.
తండ్రిని దొంగ అని అన్నందుకే జాడో జావిద్ హత్య : పోలీసులు ఫలక్‌నుమా ఠాణాలో రౌడీ షీట్..
మృతుడు జాడో జావిద్‌పై ఫలక్‌నుమా ఠాణాలో రౌడీ షీట్ ఉంది. మృతుడిపై పలు చోరీ కేసులు కూడా ఉన్నట్లు డీసీపీ గజరావు భూపాల్ పేర్కొన్నారు. ఈ నెల 4న మధ్యాహ్నం జాడో జావిద్... జమీల్ ఖురేషిని ఆపి బెదిరించి.. వాళ్ల తండ్రిని దొంగ అన్నాడు. దీంతో జమీల్ తన ఇద్దరు సోదరులు సహా మరో నలుగురు సహకారంతో హత్యకు పథకం రచించినట్లు డీసీపీ తెలిపారు
తండ్రిని దొంగ అని అన్నందుకే జాడో జావిద్ హత్య : పోలీసులు కత్తులతో విచక్షణ రహితంగా..
అన్సారీ రోడ్ వద్ద ఉన్న జాడో జావిద్‌ను కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి హతమార్చారు. బండ్లగూడ ప్రాంతంలో దాగి ఉన్న జమీల్ ఖురేషి, ఆనంద్ కుమార్, ఇద్దరు మైనర్లను మొత్తం ఐదగురిని ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసినట్లు దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ స్పష్టం చేశారు.
తండ్రిని దొంగ అని అన్నందుకే జాడో జావిద్ హత్య : పోలీసులు ఇవీ చూడండి : కొవిడ్ మందు పేరుతో పురుగులమందు తండ్రికి తాగించిన కుమారుడు