మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో గత కొన్ని రోజులుగా వాహనాల్లో బ్యాటరీలను చోరీ చేస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం తెల్లవారుజాము సమయంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానమొచ్చి ముగ్గురిని విచారించగా అసలు విషయం బయటపడింది.
వాహనాల్లో బ్యాటరీలు చోరీ చేస్తున్న నిందితుల అరెస్టు - తెలంగాణ నేర వార్తలు
జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను జడ్చర్ల పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు లక్షల విలువైన వాహనాల బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు.
![వాహనాల్లో బ్యాటరీలు చోరీ చేస్తున్న నిందితుల అరెస్టు వాహనాల్లో బ్యాటరీలు చోరీ చేస్తున్న నిందితులు అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8940106-455-8940106-1601053952862.jpg)
వాహనాల్లో బ్యాటరీలు చోరీ చేస్తున్న నిందితులు అరెస్టు
నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన విష్ణు, హన్వాడ మండలానికి చెందిన వాన రాశి సులేమాన్, మహబూబ్‌నగర్‌కు చెందిన వాన రాశి నవీన్ కుమార్ ముఠాగా ఏర్పడి వాహనాల్లో బ్యాటీరీలు ఎత్తుకెళ్తున్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ద్విచక్రవాహనం, ఆటోతో పాటు ఐదు లక్షల రూపాయల విలువైన బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.