యశోద గ్రూపు ఆసుపత్రులపై ఆదాయపన్నుశాఖ దాడులు - hyderabad news
11:11 December 22
యశోద గ్రూపు ఆసుపత్రులపై ఆదాయపన్నుశాఖ దాడులు
హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో యశోద గ్రూపు ఆసుపత్రులపై ఆదాయపన్నుశాఖ దాడులు చేస్తోంది. ఆదాయపన్ను చెల్లింపుల్లో వ్యత్యాసం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించి సోదాలు చేస్తున్నట్లు ఐటీశాఖ అధికారులు తెలిపారు. మొత్తం 20కి పైగా బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. యశోద గ్రూపు కార్యాలయాలతోపాటు ఆసుపత్రులకు సంబంధించిన వైద్యుల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
ఉదయం నుంచి ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. కోల్‌కతాకు చెందిన ఓ ఆహార ఉత్పత్తి సంస్థపై కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు బృందాలు ఈ ఆహార సంస్థ కార్యాలయాలల్లో సోదాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:మాజీ ఎంపీ రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు