తెలంగాణలో సివిల్ కాంట్రాక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో రూ.160 కోట్లు నగదు, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ నగరంలో 19 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు ప్రకటించింది. బోగస్ సబ్ కాంట్రాక్టర్లను చూపి తద్వారా ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారన్న అభియోగంపై సోదాలు నిర్వహించినట్లు స్పష్టం చేసింది.
ఈనెల 7న సోదాలు... రూ.160 కోట్లు నకిలీ లావాదేవీల పత్రాలు స్వాధీనం - hyderabad it rides
20:44 January 12
ఈనెల 7న సోదాలు... రూ.160 కోట్లు నకిలీ లావాదేవీల పత్రాలు స్వాధీనం
నకిలీ బిల్లులు సృష్టించి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడెట్‌ను పొందేందుకు యత్నించారనేందుకు అవసరమైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రముఖ సివిల్ కాంట్రాక్టర్‌కు సంబంధించిన అనుయాయులు, మనీ లెండర్లు, నగదు లావాదేవీలు జరుపుతున్నవారు, మధ్యవర్తులకు చెందిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.
డిజిటల్‌గా నడిపిన లావాదేవీలకు చెందిన వివరాలతో కూడిన పెన్ డ్రైవ్‌లు, మెయిల్స్‌లను ఫోరెన్సిక్ నిపుణులతో అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. ఐటీ సోదాల్లో రూ.160 కోట్లు నగదు, బోగస్ బిల్లులు, నకిలీ లావాదేవీల పత్రాలతోపాటు విలువైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్ననట్లు పేర్కొన్న ఐటీ శాఖ తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి:పలువురు గుత్తేదారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు