నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని మధ్యమండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.
మొబైల్ యాప్‌ల ద్వారా బెట్టింగ్...ఇద్దరు అరెస్ట్ - హైదరాబాద్ వార్తలు
మొబైల్ యాప్‌ల ద్వారా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను మధ్యమండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
![మొబైల్ యాప్‌ల ద్వారా బెట్టింగ్...ఇద్దరు అరెస్ట్ ipl-cricket-betting-in-nampally two persons arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9148509-874-9148509-1602504892406.jpg)
మొబైల్ యాప్‌ల ద్వారా బెట్టింగ్...ఇద్దరు అరెస్ట్
హబీబ్ నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ శీలర్ బాబా, సాజిద్ అనే ఇద్దరు నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న నేషనల్ ట్రావెల్స్‌లో పనిచేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడ్డారు. ఈ దాడుల్లో వారి వద్ద నుంచి 7250 రూపాయల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని నాంపల్లి పోలీసులకు అప్పగించారు.