తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అనంతపురంలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ - anantapur district latest news

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న 22 మందిని ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా సోమందేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు, చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

ipl-cricket-betting-gang-arrested-in-somandepalli-anantapur-district
అనంతపురంలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

By

Published : Oct 8, 2020, 7:24 PM IST

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 62,500 రూపాయల నగదు, 21 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు స్టేషన్​లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మహబూబ్ బాషా కేసు వివరాలను వెల్లడించారు.

ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్నందున క్రికెట్ బెట్టింగ్​లు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచామని ఆయన వెల్లడించారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న 22 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. డబ్బుల కోసం యువత అడ్డదారి తొక్కవద్దని... జిల్లాలో బెట్టింగ్​లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

ఇదీ చూడండి: లాటరీ పేరుతో రూ. 6 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

ABOUT THE AUTHOR

...view details