సికింద్రాబాద్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురిని ఉత్తర మండల టాస్క్‌పోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 39 వేల రూపాయల నగదు, ఎల్ఈడీ టీవీ, ఆరు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ - సికింద్రాబాద్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్
సికింద్రాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 39 వేల నగదు, ఎల్ఈడీ టీవీ, ఆరు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
![సికింద్రాబాద్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ IPL Betting people arrested in secunderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9265082-1059-9265082-1603309475598.jpg)
సికింద్రాబాద్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
నగరంలోని ఓ ఇంట్లో రహస్యంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న సదాశివ, శ్రీనివాస్, చంద్రయ్య, సంపత్‌కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ్యాచ్ జరిగే సమయంలో బంతి బంతికి బెట్టింగ్ నిర్వహించేవారని పోలీసులు తెలిపారు. డబ్బులను ఆన్లైన్లోనే బదిలీ చేసుకుంటున్నట్లు గుర్తించారు. నిందితులను చిలకలగూడ పోలీసులకు అప్పగించారు.