గత కొద్దినెలలుగా ఆదిలాబాద్ జిల్లాలో చోరీ కేసుల అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో దస్నాపూర్ తిరుమల పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు నిఘా పెట్టారు. శనివారం అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వెళ్తూ కనిపించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే వారిని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 7 ఆటోలు సహా ఒక ద్విచక్ర వాహనం దొంగలించినట్టు నిందితులు పోలీసుల వద్ద ఒప్పుకున్నారు.
ఆదిలాబాద్లో అంతర్రాష్ట్ర దొంగలు ముఠా అరెస్టు.. 7ఆటోలు స్వాధీనం - ఆదిలాబాద్లో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు
ఆదిలాబాద్ జిల్లాలో వరుస చోరీలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 7 ఆటోలు ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గత ఎనిమిది నెలల నుంచి లాక్డౌన్ సమయంలో ఇంటి బయట ఉన్న ఆటోలను గమనించి రాత్రి సమయంలో దొంగలించేవారని ఎస్పీ విష్ణు వారియర్ తెలిపారు. అంతరాష్ట్ర దొంగల ముఠాలోని ఈఇద్దరు సభ్యులను అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం టాస్క్ ఫోర్స్ బృందానికి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. విజయవంతంగా వీరిని పట్టుకుని బాధితులకు వాహనాలను అప్పగించిన ఆదిలాబాద్ గ్రామీణ సీఐ కె.పురుషోత్తం చారి, ఎస్సై డి.రమేశ్, పర్యవేక్షించిన డీఎస్పీ వెంకటేశ్వరరావు, సహకరించిన టాస్క్ ఫోర్స్ సీఐ ఈ.చంద్రమౌళి టీం సభ్యులను ఎస్పీ అభినందించారు.
TAGGED:
ఆదిలాబాద్ నేరవార్తలు