తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆదిలాబాద్​లో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్​ - అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్​

ఇరవై రోజుల క్రితం సినీ ఫక్కీలో దొంగతనానికి పాల్పడిన అంతర్​ రాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి పాన్‌మసాల, సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.

interstate thieves gang arrested in adilabad
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్​

By

Published : Oct 31, 2020, 8:50 PM IST

ఆదిలాబాద్‌లో 20 రోజుల క్రితం సినీ ఫక్కీలో దొంగతనానికి పాల్పడిన అంతర్​ రాష్ట్ర దొంగల ముఠా పట్టుబడింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన అరీఫ్‌ మరో నలుగురితో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. వీరు అక్టోబర్‌ 8న ఆదిలాబాద్‌ బి. రాములు కాంప్లెక్స్​లోని ఓ దుకాణంలో రూ. 8 లక్షల విలువ చేసే పాన్‌మసాలా, సిగరెట్లను దొంగలించారు.

ఈ కేసును సవాల్​గా తీసుకున్న ఆదిలాబాద్‌ పోలీసులు శనివారం ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి పాన్‌మసాల, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడితో పాటు మరొకరి కోసం గాలిస్తున్నట్టు ఆదిలాబాద్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:భూ వివాదం పరిష్కారానికి లంచం డిమాండ్.. అనిశాకు చిక్కిన సీఐ

ABOUT THE AUTHOR

...view details