తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు - అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన బాలానగర్ పోలీసులు

హైదరాబాద్‌లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను బాలానగర్‌ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 40 తులాల బంగారం, కిలో వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

By

Published : Sep 19, 2020, 5:01 AM IST

హైదరాబాద్‌లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను బాలానగర్‌ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 40 తులాల బంగారం, కిలో వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన నిందితుడు డబ్బుల కోసం చోరీలే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ఐదు సంవత్సరాల నుంచి మచ్చబొల్లారంలో నివసిస్తూ... చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. జనసంచారం ఎక్కువగా లేని వీధులు, తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా ఎంచుకొని చోరీలకు పాల్పడేవాడని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details