సీలేరు మన్యం నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను.. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. సీలేరు మన్యంలో మంగ అనే మహిళ నుంచి రమేశ్, మదన్ అనే వ్యక్తులు గంజాయి కొనుగోలు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అరెస్టు చేసిన రమేశ్, మదన్ల నుంచి 76 కిలోల గంజాయి, కారు, ద్విచక్రవాహనం, రూ.3వేలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ - rachakonda cp mahesh bhagawath
అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 76 కిలోల గంజాయి, కారు, ద్విచక్రవాహనం, రూ.3వేలు స్వాధీనం చేసుకున్నారు.

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు
అన్‌లాక్ తర్వాత మహిళల అక్రమ రవాణా మళ్లీ మొదలైందని మహేశ్ భగవత్ తెలిపారు. మహిళల అక్రమ రవాణాకు పాల్పడిన ఏడుగురు నిందితులను ఎస్ఓటీ బృందం అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరిలో ముగ్గురు బంగాల్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. నిందితులకు సంబంధించిన ఐదు బ్యాంకు ఖాతాలను సీజ్ చేయించినట్లు సీపీ పేర్కొన్నారు.