తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇంటర్​ విద్యార్థిని అదృశ్యం.. ఇంట్లో గొడవలే కారణం - ఇంటర్​ విద్యార్థిని అదృశ్యం

ఇంట్లో గొడవపడి వెళ్లిన ఇంటర్​ విద్యార్థిని కనిపించకుండాపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ పీఎస్​ పరిధిలో జరిగింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థిని ఆచూకీ కోసం వెతుకుతున్నారు.

intermediate student goes missing in rangareddy district
ఇంటర్​ విద్యార్థిని అదృశ్యం

By

Published : Oct 8, 2020, 11:31 PM IST

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్ పీఎస్​ పరిధిలోని తట్టి అన్నారంలో నివాసముండే కుమారి లారా అనే ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంట్లో గొడవ పడి బయటికి వెళ్లిన లారా తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల వెతికినా కుటుంబ సభ్యులకు లారా ఆచూకీ లభించకపోవడం వల్ల తండ్రి రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హయత్​నగర్ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి లారా ఆచూకీ కోసం వెతుకుతున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఇవీ చూడండి: చెబితే వినాలి... లేకుంటే కేసులు తప్పవు

ABOUT THE AUTHOR

...view details