పదమూడేళ్లుగా 54 దొంగతనాలు చేసిన అంతర్జిల్లా దొంగను సాంకేతికత సాయంతో గజ్వేల్ పోలీసులు అరెస్టు చేశారని సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. చెడు అలవాట్లకు బానిసై చిన్నతనం నుంచే బాల్ లింగం అనే వ్యక్తి దొంగతనాలకు పాల్పడ్డాడని సీపీ వివరించారు. నిందితునిపైన ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
13 ఏళ్లుగా దొంగతనాలు.. అంతర్ జిల్లా దొంగ అరెస్టు - సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ తాజా వార్తలు
పదమూడేళ్లుగా 54 దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగను గజ్వేల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితునిపైన ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయని సిద్దిపేట సీపీ తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై చిన్నతనం నుంచే దొంగతనాలకి పాల్పడినట్లు సీపీ వివరించారు.
13 ఏళ్లుగా దొంగతనాలు.. అంతర్జిల్లా దొంగ అరెస్టు
అప్పట్లో జువైనల్ హోమ్‌కి నిందితుడిని తరలించారని.. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత స్నేహితులతో కలిసి సిద్దిపేట, అల్వాల్, గజ్వేల్, కార్ఖానా ఇలా వివిధ ప్రాంతాల్లో పగటిపూట తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతుండేవారని సీపీ వివరించారు. పదిహేను రోజుల క్రితం ఓ ఇంట్లో వీళ్లు 8 తులాలకి పైగా దొంగతనం చేశారని వెల్లడించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేసిన దర్యాప్తు అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:దారుణం: బావమరుదులే బలి తీసుకున్నారు..!