ఇంటర్ ఫలితాల్లో గందరగోళం మరో విద్యార్థిని ప్రాణం తీసింది. పరీక్షలో తప్పానని మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది ఓ విద్యార్థిని. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిరుమాలపురం గ్రామానికి చెందిన జ్యోతి(17) చేవెళ్లలోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివింది. విడుదలైన ఫలితాలలో ఒక సబ్జెక్టులో ఫెయిలయ్యింది. ఫలితాలు వచ్చిన సమయంలో శేరిగూడ గ్రామంలోని బంధువుల ఇంట్లో ఉంది. మంగళవారం తమ సొంత ఇంటికి వచ్చిన అనంతరం ఎవరు లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ళ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - undefined
ఇంటర్ బోర్డు.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్లో చోటు చేసుకుంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయానని మనస్తాపంతో జ్యోతి(17) ఆత్మహత్య చేసుకుంది.
మరో విద్యార్థిని ఆత్మహత్య
TAGGED:
inter student suicide