సంగారెడ్డి జిల్లా వెలిమెల నారాయణ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం బోయినపల్లికి చెందిన చంద్రశేఖర్ కుమార్తె ఇంటర్ ఎంపీసీ తొలి సంవత్సరం చదువుతోంది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మరుగుదొడ్డిలోని నీటిపైపునకు ఉరేసుకుంది. గమనించిన కళాశాల యాజమాన్యం... ఆసుపత్రికి తరలించగా విద్యార్థిని మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
'సెలవు ఇవ్వలేదనే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది' - sangareddy dist news
నా కూతురికి నాలుగు రోజుల నుంచి జ్వరం... సెలవు అడిగితే కళాశాల యాజమాన్యం ఇవ్వలేదు. అందుకే ఆ బాధతో నా బిడ్డ ఆత్మహత్య చేసుకుంది. అని విద్యార్థి తండ్రి ఆరోపించాడు.
బలవన్మరణానికి పాల్పడిన ఇంటర్ విద్యార్థిని
నాలుగు రోజుల క్రితం జ్వరంగా ఉందని కళాశాల యాజమాన్యంను సెలవు అడిగినా... ఇవ్వడం లేదని తనకు ఫోన్ చేసినట్లు మృతురాలి తండ్రి తెలిపాడు. అందుకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆసుపత్రిలో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇవీ చూడండి:ఆడపిల్ల పుట్టిందని... పక్కనోళ్ల పిల్లాడిని ఎత్తుకెళ్లాడు!
Last Updated : Feb 26, 2020, 8:57 AM IST