తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విశాఖలో దారుణం: యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది - ఇంటర్ యువతి గొంతుకోసి చంపిన యువకుడు

ఏపీలోని విశాఖ జిల్లా గాజువాకలో మరో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్​ చదువుతున్న యువతి గొంతుకోసి ఓ ప్రేమోన్మాది కిరాతకంగా హత్య చేశాడు. ఘటనాస్థలంలో ఇద్దరు యువకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించగా...ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

inter-student-brutally-murder-in-vishaka
విశాఖలో దారుణం: యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది

By

Published : Oct 31, 2020, 11:56 PM IST

విశాఖలో దారుణం: యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్ సుందరయ్యకాలనీలో దారుణం జరిగింది. ఇంటర్‌ చదువుతున్న 17 ఏళ్ల యువతిని ఓ ప్రేమోన్మాది గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. ఘటనాస్థలంలో ఇద్దరు యువకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించగా... అఖిల్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. అఖిల్ న్యాయవిద్య అభ్యసిస్తున్నట్లు గుర్తించగా... కత్తితో ఎవరు దాడి చేశారనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details