తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తాళంవేసి ఉన్న ఇళ్లే లక్ష్యం.. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు - ఖమ్మంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఖమ్మం మూడో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 13 లక్షల విలువైన సొత్తును రికవరీ చేసుకున్నారు.

inter state thieves were arrested by khammam police
తాళంవేసి ఉన్న ఇళ్లే లక్ష్యం.. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు

By

Published : Oct 27, 2020, 4:49 PM IST

ఖమ్మం నగరానికి చెందిన ఓ యువకుడితో పాటు విజయవాడ, కర్నూలుకు చెందిన ఇద్దరు దొంగలు ఓ ముఠాగా ఏర్పడి తాళం వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్టు ఏసీపీ ఆంజనేయులు తెలిపారు. వారు ఖమ్మం కమిషనరేట్‌ పరిధిలో 7 దొంగతనాలు చేసినట్లు చెప్పారు.

ప్రస్తుతం ఆ ముఠాలో ఇద్దరు నిందితులను పట్టుకున్నామని.. మరో నిందితుడు ప్రకాశం జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదిగా ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు. నిందితుల నుంచి వెండి, బంగారం, టీవీ, ఓ స్కూటర్‌ స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 13 లక్షల విలువైన సొత్తును రికవరీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను ఖమ్మం జిల్లా కోర్టులో ప్రవేశపెట్టి.. రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు.

ఇదీ చూడండి:అంజన్‌రావు ఇంట్లో నగదు సీజ్‌ చేసిన దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details