నగర శివారు ప్రాంతాలు, జనసంచారం లేని ప్రదేశాలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా హైదరాబాద్ పోలీసులకు చిక్కింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి లాడ్జీలలో ఉంటూ ద్విచక్ర వాహనాలను రెప్పపాటులో దొంగిలిస్తారు. ఆరు నెలలుగా దాదాపు 23 బైక్‌లను అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు. కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన ప్రధాన నిందితులు... వాజీద్, షేక్‌సోనుతోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అబిడ్స్ జగదీష్ మార్కెట్ ఆలయంలో బంగారు ఆభరణాలు దొంగిలించి... సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు... సమీపంలోని లాడ్జీల్లో తనిఖీలు చేయగా నిందితులు దొరికినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
యూట్యూబ్ చూసి చోరీలు.. ఆఖరికి చిక్కారు.. - అంతర్ రాష్ట్ర దొంగలను ప్రవేశపెట్టిన సీపీ అంజనీ కుమార్
యూట్యూబ్‌లో చూసి అందులో చూపించినట్లుగా... ఇంటిముందు ఉన్న ద్విచక్రవాహనాలను చోరీచేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆరునెలలుగా దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠా... ఎట్టకేలకు ఓ ఆలయంలో చేసిన చోరితో దొరికిపోయారు. ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు... వారి నుంచి 35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
అలా చూసి.. ఇలా ఎత్తుకెళ్తారు.. ఆఖరికి చిక్కారు
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి ప్రాంతాల్లో నేరగాళ్లు మొత్తం 26 చోరీలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. పరారీలో ఉన్న ముఠాకు చెందిన మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇళ్ల ముందు వాహనాలు నిలిపి ఉంచే వారు తగు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. ఇళ్ల వద్ద తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి:రూ.65కోట్ల రుణం తీసుకొని విదేశాలకు పారిపోయిన నిందితుడి అరెస్ట్
Last Updated : Jan 17, 2021, 8:11 AM IST