తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

హయత్​నగర్​లో ఇంటర్​ విద్యార్థిని అదృశ్యం...! - అదృ-శ్యం కేసు వివరాలు

ఆన్​లైన్​ క్లాసులు అర్థంకావటం లేదని చెప్పినందుకు తల్లి మందలించగా... మనస్తాపంతో ఓ ఇంటర్​ విద్యార్థిని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన మంగళవారం జరగ్గా... నేటికీ ఆచూకీ దొరకకపోవటం వల్ల పోలీసులకు విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

inter first year student missing in hayathnagar
inter first year student missing in hayathnagar

By

Published : Dec 17, 2020, 11:03 PM IST


రంగారెడ్డి జిల్లా హయత్​నగర్ పోలీస్​స్టేషన్ పరిధిలోని తొర్రుర్​కు చెందిన విద్యార్థిని అదృశ్యమైంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయి... ఆన్​లైన్​ క్లాస్ అర్థం కావడం లేదని తల్లికి చెప్పింది. తెల్లారితే పరీక్ష పెట్టుకుని క్లాస్​ అర్థంకావటంలేదని చెప్పటమేంటని కూతురిని ఆ తల్లి మందలించింది.

మందలింపుతో మనస్తాపం...

తల్లి మందలింపుతో మనస్తాపం చెందిన మౌనిక... మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు... అన్ని చోట్ల వెతికినా లాభం లేకపోయింది. నిన్నటి వరకూ... ఆచూకీ లభ్యం కాకపోవటం వల్ల తల్లితండ్రులు హయత్​నగర్ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సీసీ కెమెరాలలో నిక్షిప్తమైన దృశ్యాలు, ఇతర సమాచారంతో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కుమారుడి కోసం ఏడాదిన్నరగా పరితపిస్తున్న తల్లిదండ్రులు

ABOUT THE AUTHOR

...view details