మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, రామకృష్ణాపూర్‌లలో చోరీలకు పాల్పడుతోన్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కాసిపేట మండలం సోమగూడెం పెద్దనపల్లి కొత్త కాలనీకి చెందిన సంపత్, బండారు లక్ష్మిలుగా గుర్తించారు. వారి వద్ద నుంచి సుమారు 21 తులాల బంగారం, 5 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.
అంతర్ జిల్లా దొంగల అరెస్ట్.. బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం - Mancherial District Latest News
మంచిర్యాల జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతోన్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
![అంతర్ జిల్లా దొంగల అరెస్ట్.. బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం Inter-district robbers arrested in mancherial district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10034810-233-10034810-1609150805625.jpg)
అంతర్ జిల్లా దొంగల అరెస్ట్.. బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
సంపత్ మీద ఇది వరకే పీడీ యాక్ట్ కేసు నమోదు అయినట్లు డీసీపీ వివరించారు. అయినప్పటికీ దొంగతనాలు మానకపోవడంతోపాటు అదే వృత్తిని సాగిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.