తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చమురు నౌకలో అగ్ని ప్రమాదం... మంటలు ఆర్పిన సహ్యాద్రి

కువైట్‌ నుంచి భారత్‌కు ముడి చమురును తీసుకొస్తున్న నౌక... శ్రీలంక తీరం సమీపంలో అగ్ని ప్రమాదానికి గురైన ఘటన భారత వర్గాల్లో కలకలం రేపింది. ఎంటీ న్యూ డైమండ్ అనే నౌక భారీ చమురు నిల్వలతో భారత్‌కు వస్తుండగా నౌక శ్రీలంకతీరంలో అగ్ని ప్రమాదానికి గురైంది. సమాచారమందుకున్న భారత నావికా దళం... ఐఎన్​ఎస్​ సహ్యాద్రి సహా మరో 2 నౌకలను పంపించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.

MT New Diamond
MT New Diamond

By

Published : Sep 5, 2020, 12:07 PM IST

Updated : Sep 5, 2020, 2:53 PM IST

రెండు రోజుల క్రితం ప్రమాదానికి గురైన భారత్​కు చెందిన ఓ చముర నౌకలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్​కు గల్ఫ్​ నుంచి క్రూడాయిల్ తీసుకువచ్చే నౌక ప్రమాదం బారిన పడింది. ఎంటీ న్యూ డైమండ్ అనే నౌక భారీ చమురు నిల్వలతో శ్రీలంక మీదుగా భారత్ ​వస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలంక తీరంలో మూడో తేదీన ఈ దుర్ఘటన జరిగింది. అప్పటి నుంచి మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.

ప్రమాద విషయాన్ని తెలుసుకున్న కోస్ట్​గార్డు... భారత నౌకా దళ యుద్ధ నౌక సహ్యాద్రిని పంపించి మంటలు అదుపులోకి తీసుకొంది. ప్రస్తుతానికి నౌకలోని మంటలు పూర్తిగా ఆరిపోయాయని అధికారులు ధ్రువీకరించారు. అయితే ఆ నౌక ప్రయాణానికి అనువుగా ఉందా లేదా అన్నది పరిశీలించిన తర్వాత నిర్దారించనున్నారు. చమురు నౌకలో మంటలు ఆర్పేందుకు ఇతర దేశాల నౌకలు కూడా సహకారం అందించాయని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

Last Updated : Sep 5, 2020, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details