తెలంగాణ

telangana

20 రోజులుగా మృత్యువుతో పోరాడిన భారత జవాన్ మృతి

By

Published : Jan 15, 2021, 9:50 AM IST

సెలవులపై ఇంటికి వచ్చిన భారత్ స్నేహితుణ్ని కలిసేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. 20 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడిన ఆ జవాన్ గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.

india-army-soldier-died-in-a-road-accident-in-nizamabad-district
సెలవులపై ఇంటికొచ్చిన జవాన్ రోడ్డు ప్రమాదంలో మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆర్మీ జవాన్​ 20 రోజులుగా మృత్యువుతో పోరాడి శుక్రవారం మృతి చెందిన సంఘటన నిజామాబాద్​లో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మెగ్యా నాయక్ తండాకు చెందిన భారత ఆర్మీ జవాన్ మోతీలాల్ (25)డిసెంబర్​లో సెలవులపై స్వగ్రామం వచ్చారు. డిసెంబర్ 30తో సెలవులు పూర్తి కానుండటం వల్ల 29న స్నేహితుడిని కలిసేందుకు తన ద్విచక్రవాహనంపై కామారెడ్డి వెళ్లారు.

భారత ఆర్మీ జవాన్ మోతీలాల్

తిరుగు ప్రయాణంలో సదాశివనగర్ మండలం వద్ద 44వ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మోతీలాల్​ను చికిత్స నిమిత్తం హైదరాబాద్​లోని యశోద ఆస్పత్రికి తరలించారు. 20 రోజులుగా కోమాలో ఉన్న మోతీలాల్​ను మెరుగైన చికిత్స కోసం అక్కణ్నుంచి ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించి గురువారం రాత్రి మోతీలాల్ మృతి చెందారు. వాన్ మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మోతీలాల్​ మృతికి పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం అతని స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details