అమాయకులను వేధిస్తున్న హిజ్రాలను అరెస్టు చేసిన ఘటన సైబరాబాద్ పరిధిలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ప్రగతినగర్ ఆర్కే లేఅవుట్లో దత్తమూర్తి అనే వ్యక్తి సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తుండగా 10మంది హిజ్రాలు వచ్చారు. రూ.20 వేల ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో.. అర్ధనగ్న ప్రదర్శన చేసి కుటుంబ సభ్యుల మధ్య అసభ్యంగా ప్రవర్తించారని దత్తమూర్తి ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్లో హిజ్రాల హల్‌చల్.. 10మంది అరెస్ట్ - హైదరాబాద్ నేర వార్తలు
అసభ్యకరంగా అర్ధనగ్న ప్రదర్శన చేసి కుటుంబ సభ్యుల మధ్య పరువుకు భంగం కలిగించారని ఓ ఇంటి యజమాని 10మంది హిజ్రాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రగతినగర్‌లో వ్రతం జరుగుతుండగా.. హిజ్రాలు చొరబడి ఇంటి యజమాని నుంచి రూ.20 వేలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో బలవంతంగా రూ.16,500 తీసుకుని వెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
హైదరాబాద్లో హిజ్రాల హల్‌చల్.. 10మంది అరెస్ట్
చివరకు ఇంటి యజమాని నుంచి రూ.16,500 బలవంతంగా వసూలు చేసి వెళ్లిపోయారు. ఈ మేరకు ఇంటి యజమాని హిజ్రాలపై బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు 10 మంది హిజ్రాలను అరెస్టు చేసి, వారి నుంచి 7 సెల్‌ఫోన్లు, రూ.16,500 నగదు, ఓ ఆటోను స్వాధీనం చేసుకుని.. రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి: భుజిలాపురం వద్ద నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత