తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

దేవికారాణికి చెందిన నగదు జప్తు చేసిన అనిశా - esi scam updates

బీమా, వైద్య సేవల కుంభకోణంలో ప్రధాన నిందితురాలు దేవికా రాణికి చెందిన మరో 1.99కోట్ల రూపాయలను అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, తమిళనాడులోని ప్రైవేట్ చిట్​ఫండ్ కంపెనీల్లో దేవికా రాణి, ఆమె కుటుంబ సభ్యుల పేర్ల మీద చిట్టీల రూపంలో పెట్టినట్లు అధికారులు తేల్చారు.

దేవికారాణికి చెందిన నగదు స్వాధీనం చేసుకున్న అనిశా
దేవికారాణికి చెందిన నగదు స్వాధీనం చేసుకున్న అనిశా

By

Published : Dec 16, 2020, 10:21 PM IST

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీమా, వైద్య సేవల కుంబకోణంలో భాగంగా నిందితుల నుంచి అనిశా అధికారులు మరోసారి నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితురాలు దేవికారాణికి చెందిన మరో రూ.1.99కోట్లను జప్తు చేశారు. తెలంగాణ, తమిళనాడులోని పలు చిట్​ఫండ్ కంపెనీల్లో డీడీల రూపంలో ఉన్న మొత్తాన్ని అనిశా ప్రత్యేక న్యాయస్థానంలో జమ చేశారు. స్థిరాస్తి వ్యాపారంలోనూ దేవికారాణి పెట్టుబడులు పెట్టినట్లు ఇది వరకే గుర్తించారు. కొన్ని నెలల క్రితం ఆమెకు చెందిన రూ.6.76 కోట్లు విలువైన డీడీలను స్వాధీనం చేసుకున్న అనిశా... వాటిని కూడా న్యాయస్థానంలో జమ చేశారు.

ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో దేవికా రాణితో పాటు మరికొంత మంది అధికారులు, మెడికల్ ఏజెంట్లు కలిసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు వేయి కోట్లకు పైగా నష్టం కలిగించినట్లు అనిశా అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రధాన నిందితురాలు దేవికారాణిపై పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఓటుకు నోటు కేసులో నిందితుడు ఉదయ్‌సింహా అరెస్టు

ABOUT THE AUTHOR

...view details