వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని పాలడైరీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఢీకొని కామేష్ అనే వలస కూలీ మృతి చెందాడు.
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కామేష్ భీమదేవరపల్లిలో కొత్తగా నిర్మిస్తోన్న కస్తూర్భా గాంధీ పాఠశాల భవన నిర్మాణ పనుల్లో కార్మికునిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో నిత్యావసర సరుకుల కోసం ముల్కనూర్‌కు వచ్చి తిరిగి వెళ్తుండగా.. పాలడైరీ సమీపంలో అతివేగంగా వచ్చిన కారు కామేష్‌ను వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన కామేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.