గోదావరి తీరంలో యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు
09:14 September 03
గోదావరి తీరంలో యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది. కొందరు పెద్దల అండదండలతో ఇసుక రవాణా మణుగూరు నుంచి హైదరాబాద్ వైపు పరుగులు తీస్తోంది.
మణుగూరు మండలంలో భారీగా ఇసుక డంప్‌లు ఉన్నాయి. రామానుజవరం, సాంబాయిగూడెం, కొండాయిగూడెం, మల్లెపల్లి, నిర్మానుష్య ప్రదేశాలు, గుట్టలు, జమాయిల్ తోటల మధ్య ఇసుక డంప్‌లు చేస్తున్నారు.
ఉదయం వేళల్లో వ్యాపారులు ఇసుక తెచ్చి రాత్రిళ్లు రవాణా చేస్తున్నారు. మణుగూరు నుంచి హైదరాబాద్‌కు జోరుగా ఇసుక రవాణా సాగుతోంది. మణుగూరు ఇసుక అక్రమ రవాణాపై స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు. ఇసుక రవాణాను రామానుజవరం సర్పంచ్ సతీశ్ అడ్డుకునేందుకు యత్నించారు. అయితే వ్యాపారులు సర్పంచ్‌తో గతంలో బేరసారాలు జరిపారు. సతీశ్ అంగీకరించకపోవడంతో ఇసుక వ్యాపారులు బెదిరింపులకు దిగారు. ఇసుక అక్రమ రవాణాపై ఉన్నతాధికారులకు సర్పంచ్ సతీశ్ లేఖ రాశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.