తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేేశ్లోని కృష్ణా జిల్లా విస్సన్నపేటకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్థానిక ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. వారి నుంచి 336 మద్యం సీసాలు, 3 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
నీటి డ్రమ్ముల మాటున తరలిస్తున్న అక్రమ మద్యం పట్టివేత - కృష్ణా జిల్లా వార్తలు
ఏపీలో మద్యం ధరలు భారీగా పెరగడం వల్ల అక్రమార్కులు అక్రమ తరలింపునకు తెరలేపారు. గడ్డి మోపుల్లో, డ్రమ్ముల్లో, ఉల్లిపాయల బస్తాల్లో.. సరకును తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సరిహద్దు రాష్ట్రాలే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణ నుంచి కృష్ణా జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని విస్సన్నపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నీటి డ్రమ్ముల మాటున తరలిస్తున్న అక్రమ మద్యం పట్టివేత
జిల్లాలోని నూజీవిడు, తిరువూరు నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలు.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ క్రమంలో మద్యం అక్రమ రవాణా లాభసాటి వ్యాపారంగా మారింది. అధికారులు స్పందించి మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.