సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్పోస్ట్ వద్ద సోమవారం అర్ధరాత్రి సుమారు రూ.ఏడు లక్షలు విలువ చేసే మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు అధికంగా ఉన్నందున కొంతకాలంగా విజయవాడకు చెందిన ముగ్గురు వ్యక్తులు.. సూర్యాపేటలో మద్యాన్ని కొనుగోలు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. సోమవారం రాత్రి రాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా డీసీఎం వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 689 లీటర్ల మద్యం పట్టుబడింది.
రామాపురం చెక్పోస్ట్ వద్ద భారీగా మద్యం పట్టివేత - రాష్ట్ర సరిహద్దులో భారీగా మద్యం పట్టివేత
ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను పెంచిన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రాకు భారీగా మద్యాన్ని తరిలిస్తున్నారు. సోమవారం రాత్రి కోదాడ మండలం రామాపురం చెక్పోస్ట్ వద్ద సూమారు రూ.7 లక్షలు విలువ చేసే మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
రామాపూరం చెక్పోస్ట్ వద్ద భారీగా మద్యం పట్టివేత
తెలంగాణలో తక్కువ ధరకు కొని.. విజయవాడలో అధిక ధరలకు విక్రయించాలనే దురుద్దేశంతో మద్యాన్ని తరలిస్తున్నారని సీఐ శివరామిరెడ్డి తెలిపారు. అక్రమంగా మద్యం తరిలిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి:'కరోనా అన్యోన్యతను పెంచింది.. మనసులను దగ్గర చేసింది'
Last Updated : Jun 16, 2020, 4:35 PM IST