కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రం నుంచి ఉట్నూర్ మండల కేంద్రానికి ద్విచక్రవాహనంపై అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు మార్గమధ్యంలో వాహనతనిఖీలు నిర్వహించగా ఇద్దరు వ్యక్తులు అక్రమంగా గంజాయిని తీసుకుని వెళ్లడం గమనించామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
ద్విచక్రవాహనంపై గంజాయి అక్రమ రవాణా.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు - కుమురంభీం ఆసిఫాబాద్‌లో అక్రమ గంజాయి పట్టివేత
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ నుంచి ఉట్నూర్‌కు ద్విచక్రవాహనంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5 కేజీల నిషేధిత మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ద్విచక్రవాహనంపై గంజాయి అక్రమ రవాణా.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు
తమను చూసి బైక్ ఉన్న రాజు అనే వ్యక్తి పరారయ్యాడని.. మరొక వ్యక్తి అమీరుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 5 కేజీల గంజాయిని, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పరారీలో ఉన్న వ్యక్తిని తర్వలోనే పట్టుకుంటామన్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు
TAGGED:
ద్విచక్రవాహనంపై గంజాయి రవాణా