సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హోతి(కె) గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ, పోలీసు అధికారులు పట్టుకున్నారు. చౌక దుకాణాలు, రేషన్ లబ్ధి దారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇంట్లో దాచిపెట్టిన బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇంట్లో రేషన్ బియ్యం.. అధికారుల స్వాధీనం - సంగారెడ్డి జిల్లా నేర వార్తలు
సంగారెడ్డి జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ, పోలీసు అధికారులు పట్టుకున్నారు. అక్రమ నిల్వలకు కారణం ఎవరన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత
అక్రమ నిల్వలకు కారణం ఎవరు, ఈ బియ్యాన్ని ఎక్కడ నుంచి సేకరించారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన బియ్యాన్ని పట్టణంలోని ఎంఎల్స్ పాయింట్లో భద్ర పరిచారు.
ఇదీ చదవండి:కిడ్నాప్ చేసిన గంటకే బాలుడి హత్య: ఎస్పీ కోటిరెడ్డి