తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇసుక అక్రమంగా తెచ్చాడు.. పశువులపాకలో దాచాడు.. - తెలంగాణ వార్తలు

వనపర్తి జిల్లాలో అక్రమంగా నిలువ ఉంచిన 250 ట్రాక్టర్ల ఇసుకని అధికారులు సీజ్​ చేశారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు.

illegal sand seized by police revenue officers at wanaparthy district
అనుమతిలేని 250 ట్రాక్టర్ల ఇసుక సీజ్

By

Published : Jan 21, 2021, 9:49 AM IST

Updated : Jan 21, 2021, 9:56 AM IST

అక్రమంగా నిలువ ఉంచిన ఇసుకని పోలీసులు, రెవెన్యూ అధికారులు సీజ్​ చేశారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలో.. నిల్వ ఉందన్న సమాచారం మేరకు అధికారులు గ్రామాన్ని సందర్శించారు.

గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి పశువుల పాకలో నిల్వ ఉంచిన దాదాపు 250 ట్రాక్టర్ల ఇసుక వివరాలను తహశీల్దార్ ఏసయ్య , రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌​ రాజేశ్వరి అడిగి తెలుసుకున్నారు. ఇసుకకి ఎలాంటి అనుమతులు లేవని నిర్ధారించుకుని సీజ్ చేశారు. దీనిని మైనింగ్ శాఖ అధికారులకు అప్పచెప్తామన్నారు.

ఇదీ చూడండి:పాతబస్తీలో సిలిండర్‌ పేలుడు

Last Updated : Jan 21, 2021, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details