తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రాజకీయ నాయకుల అండదండలతో ఇసుక దందా! - ఇసుక మాఫియా వార్తలు

గతేడాది కురిసిన భారీ వర్షాలకు చెరువులు, వాగులు నిండిపోయాయి. ఇది ఇసుక వ్యాపారులకు బాగా కలిసి వచ్చింది. ఇంకేముంది రాత్రివేళ్లల్లో ఇసుక తరలింపు ప్రక్రియను ప్రారంభించారు. అడ్డువచ్చిన వారిని బెదిరిస్తూ... రాజకీయనాయకుల అండదండలతో ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.

illegal-sand-digging-at-warangal-urban-distrcit
రాజకీయ నాయకుల అండదండలతో ఇసుక దందా!

By

Published : Jan 20, 2021, 12:23 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కమాలాపూర్​ మండలంలో ఇసుకదందా జోరుగా కొనసాగుతోంది. మర్రిపల్లిగూడెం, వంగపల్లి, శనిగరం, అంబాల వాగుల వద్ద రాత్రి వేళల్లో... జేసీబీలతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఒకవేళ అధికారులు ఇసుకను తరలించే ట్రాక్టర్లు, జీసేబీలను పట్టుకుంటే వారిని రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు.

చీకటి దందా..

ఒక్కొ ట్రాక్టర్‌ ఇసుకకు రూ.6వేల వరకు వసూలు చేస్తున్నారు. కొందరు ఇసుక వ్యాపారులు రాజకీయ నాయకుల అండదండలతో... పంచాయతీల అనుమతుల పేరుతో చీకటి దందాను నిర్వహిస్తున్నారు. ఈ దందా కోసమే కొందరు వ్యాపారులు ట్రాక్టర్లను సైతం కొనుగోలు చేశారు. మధ్యాహ్న సమయాల్లో ఇసుకను డంప్‌ చేసుకొని... రాత్రి వేళల్లో కావల్సిన ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.

ఇసుక దందాను అడ్డుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. లేకుంటే భూ గర్భజలాలు పడిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో ఇసుక తరలింపు విషయం దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్‌ జ్యోతివరలక్ష్మీ హెచ్చరించారు.

ఇదీ చూడండి:సాగునీరిస్తేనే ఓట్లెస్తాం: సుంకిశాల తండావాసులు

ABOUT THE AUTHOR

...view details