తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఏపీలో రూ. కోటి విలువ చేసే ఎర్రచందనం పట్టివేత - ఎర్రచందనం పరిరక్షణ దళం

అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఓ లారీని ఏపీలోని తిరుపతి, కోడూరు టాస్క్​ఫోర్స్ ప్రత్యేక బృందాలు సంయుక్తంగా అడ్డుకున్నాయి. తిరుపతి నుంచి చెన్నై వైపు వెళ్తున్న లారీలో ఎర్రచందనం దుంగలు ఉన్నట్టు అందిన సమాచారంతో తనిఖీ చేసినట్టు పోలీసులు తెలిపారు.

illegal-red-sandal-transporting-lorry-caught-by-tirupathi
ఏపీలో రూ. కోటి విలువ చేసే ఎర్రచందనం పట్టివేత

By

Published : Dec 26, 2020, 8:03 PM IST

ఏపీలోని శేషాచలం అడవుల నుంచి అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న ఒక లారీని, అందులో దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎర్రచందనం పరిరక్షణ దళం తిరుపతి డీఎస్పీ వెంకటయ్య తెలిపారు. తిరుపతి నుంచి చెన్నై వైపు వెళ్తున్న లారీలో ఎర్రచందనం దుంగలు ఉన్నట్టు సమాచారం అందిందని చెప్పారు.

తిరుపతి, కోడూరు టాస్క్​ఫోర్స్ ప్రత్యేక బృందాలు సంయుక్తంగా లారీని వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. వాహనంలోని కూలీలు పరారవగా.. డ్రైవర్​ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 4 టన్నులు ఉన్న దుంగలు పట్టుబడ్డాయని.. వాటి విలు ఒక కోటి రూపాయలు ఉంటుందని చెప్పారు. కేసు నమోదు చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details