సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఆటో నగర్లో ఓ రేకుల షెడ్డులో అక్రమంగా నిల్వ చేసిన 150 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందని వారు తెలిపారు.
150 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత - అక్రమ బియ్యం పట్టివేత
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో అక్రమంగా నిల్వ చేసిన 150 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, పౌర సరఫరా శాఖ అధికారులు పట్టుకున్నారు. చౌక దుకాణాలు, రేషన్ లబ్ధిదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేసి.. అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నసమయంలో అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
![150 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత Illegal Ration Rice Caught by revenue officers In Sangareddy District Zaheerabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9055166-248-9055166-1601885612954.jpg)
150 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
చౌక ధరల దుకాణాలు, లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యం కొని.. బ్లాక్మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతారని.. బియ్యం నిల్వ చేసిన వ్యక్తుల మీద కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ బసవయ్య తెలిపారు. పట్టుబడిన బియ్యాన్ని జహీరాబాద్లోని పౌర సరఫరా గోదాంకు తరలించారు.
ఇదీ చూడండి:కొవిడ్ నుంచి కోలుకున్నా.. వేధిస్తున్న సాధారణ సమస్యలు