తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అక్రమంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్​.. 200 బస్తాలు పట్టివేత

రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ అక్రమ రవాణా చేస్తున్న ఓ రైస్ మిల్లు ఓనర్​ సహా ఆరుగురు వ్యక్తులను మహబూబాబాద్​ జిల్లా పెద్దవంగర పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 200 బస్తాల రేషన్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Jul 28, 2020, 4:14 PM IST

Updated : Jul 28, 2020, 10:17 PM IST

150 bags ration rice caught in mahabubabad
అక్రమంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్​.. 200 బస్తాలు పట్టివేత

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్ గ్రామంలోని కనకదుర్గ బీని రైస్ మిల్లులో భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తొర్రూర్, పెద్ద వంగర మండలాల మధ్యవర్తులు, దళారులను ఆసరాగా చేసుకుని వారి వద్ద నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి.. వాటిని రీసైక్లింగ్ చేసి.. హైదరాబాద్,​ భువనగిరి పరిసర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఈ మేరకు పక్కా సమాచారం అందుకున్న పెద్దవంగర పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు.

ఈ సోదాల్లో 200 బస్తాల రేషన్ బియ్యంతో పాటు 3 ఆటోలు, ఒక బైక్​ను స్వాధీనం చేసుకున్నారు. రైస్​మిల్ ఓనర్​తో పాటు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జితేందర్, సివిల్ సప్లై అధికారి నారాయణ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

Last Updated : Jul 28, 2020, 10:17 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details