లాక్డౌన్ను ఉల్లంఘించి అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారనే సమాచారంతో... బేగంపేటలోని ఓ పబ్ కిచెన్పై పంజాగుట్ట పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.1.50 లక్షల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. టెన్డౌనింగ్ స్ట్రీట్ పబ్ కేంద్రంగా కిచెన్ మేనేజర్ రాంబాబు.. సెక్యూరిటీ గార్డ్ సాయంతో మద్యాన్ని అక్రమంగా విక్రయించేవాడు.
కిచెన్ నుంచి పబ్ లోపలికి వెళ్ళడానికి దారి ఉంది... పబ్లో మద్యం తీసుకువచ్చి కిచెన్ పక్కనే ఉన్న గదిలో ఉంచేవాడు. మద్యం కావాల్సిన వారు అక్కడికే వచ్చి తీసుకునేవారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు.