తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

హైదరాబాద్​లో అనకాపల్లి గంజాయి స్వాధీనం - అనకాపల్లి నుంచి హైదరాబాద్​కు గంజాయి తరలింపు

అక్రమంగా తరలిస్తున్న 60 కిలోల గంజాయిని పేట్​ బషీరాబాద్​ పోలీసులు కొంపల్లి వద్ద స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి నుంచి హైదరాబాద్​కు ఆరెంజ్​ ట్రావెల్స్​లో తరలిస్తుండగా సోదాలు నిర్వహించారు.

illegal ganja tranport caught petbasheerabad police in kompalli
హైదరాబాద్​లో అనకాపల్లి గంజాయి స్వాధీనం

By

Published : Jul 5, 2020, 10:59 PM IST

అనకాపల్లి నుంచి హైదరాబాద్​కు అక్రమంగా తరలిస్తున్న... 60 కిలోల గంజాయిని పేట్​ బషీరా​బాద్​ పోలీసులు పట్టుకున్నారు. సిరాజుద్దీన్​ అనే వ్యక్తి ఆరెంజ్​ ట్రావెల్స్​లో గంజాయి తరలిస్తున్నాడు. ట్రావెల్స్​ సిబ్బందితో ఇతర విషయంలో సిరాజుద్దీన్​కు గొడవ జరిగింది. ఈ క్రమంలో ట్రావెల్​ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొంపల్లి వద్ద సోదాలు చేసిన పోలీసులు... గంజాయి స్వాధీనం చేసుకొని, నిందితుడిని విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details