తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నాటు సారా స్వాధీనం.. గంజాయి మొక్కలు ధ్వంసం - వీర్నపల్లి మండలంలో ఎక్సైజ్​ అధికారుల దాడులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని పలు తండాల్లో ఎక్సైజ్​ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 120 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి నాటుసారా, బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. రంగంపేటలో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను గుర్తించి వాటిని ధ్వంసం చేశారు.

illegal businesses collapsed by excise police in rajanna sircilla district
వీర్నపల్లి మండలంలో నాటు సారా స్వాధీనం

By

Published : Nov 6, 2020, 10:08 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ఎక్సైజ్​ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండలంలోని పలు తండాల్లో నాటుసారా, బెల్లం స్వాధీనం చేసుకున్నారు. రంగంపేటలో ఓ రైతు పత్తి పంటతో పాటు అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలని ధ్వంసం చేసి నిందితులపై కేసు నమోదు చేశారు.

బెల్లం పానకం ధ్వంసం

మండలంలోని ఖేలోత్​ తండా, బండ, భంగిరెడ్డి నాయక్, హన్మ నాయక్​, గర్జనపల్లి, వన్​పల్లి, సీతారాం తండాల్లో ఎల్లారెడ్డి పేట ఎక్సైజ్​ అధికారులు.. నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 120 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 4 లీటర్ల నాటు సారా, 8 కిలోల బెల్లం, 2 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి పాల్పడిన ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

అనంతరం రంగంపేటలో భూక్య తులసిరామ్, భూక్య తిరుపతి వారి పత్తి చేనులో అంతర పంటగా సాగుచేస్తున్న 261 గంజాయి మొక్కలను గుర్తించి వాటిని పీకేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:మూసీ మురుగు వదిలింది.. ఊపిరాడుతోంది...

ABOUT THE AUTHOR

...view details