తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గుంటూరులో ఐఐటీ విద్యార్థి అనుమానాస్పద మృతి - ఐఐటీ విద్యార్థి మృతి వార్తలు

స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఏపీలో గుంటూరులోని చైతన్యపురిలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

iit-student-dies-under-suspicious-circumstance-in-guntur
గుంటూరులో ఐఐటీ విద్యార్థి అనుమానాస్పద మృతి

By

Published : Jan 3, 2021, 11:42 AM IST

ఏపీలో.. గుంటూరులోని చైతన్యపురిలో ఐఐటీ విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. నగరంలోని చంద్రమౌళి నగర్​కు చెందిన గంగిశెట్టి రిత్విక్... కర్ణాటకలో ఐఐటీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కరోనా కారణంగా ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటున్నాడు.

శనివారం సాయంత్రం చైతన్యపురిలోని మైత్రివనం అపార్ట్​మెంట్​లోని స్నేహితుడిని కలిసేందుకు వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత అపార్ట్​మెంట్​ ఎదుట విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికులు సమాచారం ఇవ్వటంతో అరుండల్ పేట పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బలవన్మరణమా?... లేదంటే ఏదైనా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రిత్విక్ తండ్రి ప్రకాశం జిల్లా ఒంగోలులో సబ్ రిజిస్టార్​గా పని చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details