తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'గుప్త నిధుల కోసం బలివ్వడానికి యత్నించిన వారిని అరెస్ట్ చేయండి' - తెలంగాణ బాలల హక్కుల సంఘం

గుప్త నిధుల పేరిట తల్లితో పాటు ఏడాదిన్నర చిన్నారిని బలి ఇవ్వడానికి ప్రయత్నించిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు.

achyutahrao

By

Published : Oct 17, 2019, 7:21 PM IST

గుప్త నిధుల పేరిట భర్త ప్రోద్భలంతో తనపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి... పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పాతబస్తీకి చెందిన ఓ వివాహిత కోరింది. భర్త, అత్తమామలు, మరిది, అత్యాచారానికి పాల్పడిన క్షుద్రపూజలు చేసే వ్యక్తిపై ఫలక్‌నూమ పోలీసులకు ఫిర్యాదు చేయగా... భర్త, మరిదిని తప్ప అందిరినీ అరెస్టు చేశారని ఆమె తెలిపింది. తనతో పాటు తన ఏడాదిన్నర కుమారుడిని బలి ఇవ్వాలని ప్రయత్నించారని బాధితురాలు వివరించింది. ఈ విషయంపై బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్‌ చేశారు.

'గుప్త నిధుల కోసం బలి ఇవ్వడానికి యత్నించిన వారిని అరెస్ట్ చేయండి'

ABOUT THE AUTHOR

...view details