తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఘరానా దొంగ మంత్రి శంకర్ ముఠా అరెస్టు - thief Shankar gang was arrested in Hyderabad

హైదరాబాద్‌లో ఘరానా దొంగ శంకర్‌ ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. 3 కమిషనరేట్లలోనూ ఈ ముఠాపై అనేక కేసులున్నట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు.

Hyderabad task force police arrested shankar gang
ఘరానా దొంగ శంకర్ ముఠాను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్

By

Published : Dec 25, 2020, 1:47 PM IST

ఘరానా దొంగ మంత్రి శంకర్​ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. శంకర్‌ సహా ముఠాలోని నలుగురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

ఘరానా దొంగ శంకర్ ముఠాను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్

శంకర్‌పై గతంలో 250 దొంగతనం కేసులుండగా... 4 సార్లు పీడీ యాక్టు కింద జైలుకు వెళ్లివచ్చినట్లు సీపీ చెప్పారు. 60 ఏళ్ల వయసులోనూ దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ముఠాపై అనేక కేసులున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి నగదు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details