తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రూ. 31.26 లక్షల హవాలా డబ్బును పట్టుకున్న పోలీసులు

హవాలా డబ్బును తరలిస్తున్న ఇద్దరినీ హైదరాబాద్​ నార్త్​ జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ. 31,26,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మనీష్​, విష్ణులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు వివరించారు.

Hyderabad Police seized Rs 31.26 lakh hawala money
రూ. 31.26 లక్షల హవాలా డబ్బును పట్టుకున్న పోలీసులు

By

Published : Oct 30, 2020, 3:19 PM IST

హైదరాబాద్​ నుంచి హవాలా డబ్బును తరలిస్తున్న ఇద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. గౌలిగూడకు చెందిన మనీష్​ తోషినివల్, షాలిబండ వాసి విష్ణు బిరాదర్​లు ద్విచక్రవాహనంపై నగదు తరలిస్తున్నారనే సమాచారంతో కుతుబీగూడలో టాస్క్​ఫోర్స్​ అధికారులు గస్తీ కాశారు. వారు వెళ్తున్న వాహనాన్ని అడ్డుకుని సుల్తాన్​బజార్​ పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

వాహనంలో రూ. 31,26,000 ఎక్కడివని మనీష్​, విష్ణులను ప్రశ్నించారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్పగా.. వారిని విచారిస్తే హవాలా సొమ్మని ఒప్పుకున్నారు. రాజస్థాన్​కు చెందిన తోషినివల్​ ఇక్కడ స్థిరపడి హవాలా సొమ్మును తరలించడం పనిగా పెట్టుకున్నాడని తేలింది. విష్ణును మనీష్ సహాయకునిగా గుర్తించారు.

ఇదీ చూడండి:ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో నూతన విధానం

ABOUT THE AUTHOR

...view details