తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బాలల అక్రమరవాణాను అడ్డుకున్న పోలీసులు - hyderabad latest news

భాగ్యనగరంలో ఏ ప్రాంతం చూసినా అక్కడ ఏదోక పనిచేసుకుంటూ కనిపించే బాలకార్మికులేందరో. వీరిలో చాలా మంది ఎక్కడ నుంచో వచ్చి జీవనం సాగిస్తున్నవారే. పనిలో పెట్టుకుంటామని చెప్పి పిల్లల్ని వేరే ప్రాంతాలకు తరలించే ముఠాలు చాలానే ఉన్నాయి. అలాంటి ముఠానే రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.

Hyderabad police arrested the  child labor transport gang
బాలల అక్రమరవాణాను అడ్డుకున్న పోలీసులు

By

Published : Feb 29, 2020, 5:48 PM IST

చిన్నారుల అక్రమ రవాణా అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా వారిలో మార్పు రావడం లేదు. తాజాగా రాచకొండ పోలీసులు 20మంది చిన్నారులను రక్షించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి హైదరాబాద్‌ నగరానికి 20 మంది బాలకార్మికులను తరలిస్తున్నారనే సమాచారంతో.. రాష్ట్ర బచ్‌పన్‌ బచావో ఆర్గనైజేషన్​తో కలిసి పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. వీరందరిని ఎల్‌బీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా సీడ్ల్యూసీ అధికారులు బాల కార్మికుల వివరాలు సేకరించారు.

వయస్సు నిర్ధరణ తర్వాత..

బాలల వయస్సు నిర్ధరణ అయిన తర్వాత.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తామని చైల్డ్‌ ప్రొటెక్షన్ అధికారి దేవేంద్ర చారి తెలిపారు. వీరిని హైదరాబాద్ నగరంలోని భవన నిర్మాణానికి, టింబర్ డిపోల్లో పెట్టడానికి తీసుకొచ్చారని పేర్కొన్నారు.

బాలల అక్రమరవాణాను అడ్డుకున్న పోలీసులు

ఇవీ చూడండి:విద్వేషపూరిత సందేశాలను అరికట్టేందుకు వాట్సప్ నంబర్​!

ABOUT THE AUTHOR

...view details