హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన ఓ వ్యాపారిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. హెర్బల్ నూనె పేరుతో రూ.52 లక్షలకు కుచ్చుటోపీ పెట్టారు. ఈ వ్యవహారమంతా మణిపూర్ కేంద్రంగా సాగిందని బాధితుడు తెలిపాడు.
హెర్బల్ నూనె పేరుతో రూ.52 లక్షలు కాజేసిన సైబర్ దొంగలు - Cyber criminals in Hyderabad
హెర్బల్ నూనె సరఫరా చేస్తామని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. దాదాపు రూ.52 లక్షలు అతని వద్ద నుంచి కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హెర్బల్ నూనె పేరుతో రూ.52 లక్షలు టోకరా
అమీర్‌పేటకు చెందిన వ్యాపారికి హెర్చల్ ఆయిల్ సరఫరా చేస్తామని సైబర్ నేరగాళ్లు రూ.52లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఒప్పందం మేరకు డబ్బు పంపినా.. నూనె సరఫరా చేయకపోవడం వల్ల మోసపోయానని బాధితుడు గ్రహించాడు. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు సైబర్ క్రైమ్‌కు తరలించారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
- ఇదీ చూడండి :సైబర్వల.. చిక్కావో విలవిల!