తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కిడ్నాపైన మూడేళ్ల పాప ఆచూకీ లభ్యం.. ఎందుకు అపహరించారంటే.. - THREE YEARS BABY KIDNAP IN MGBS CASE UPDATES

హైదరాబాద్​ ఎంజీబీఎస్​లో అవహరణ గురైన మూడేళ్ల పాప కేసును పోలీసులు ఛేదించారు. కేవలం 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్​ చేసినట్లు సీపీ అంజనీకుమార్​ తెలిపారు.

HYDERABAD CP
కిడ్నాపైన మూడేళ్ల పాప ఆచూకీ లభ్యం.. ఎందుకు అపహరించారంటే..

By

Published : Nov 16, 2020, 4:41 PM IST

హైదరాబాద్​ ఎంజీ బస్​స్టేషన్​లో మూడేళ్ల పాప అపహరణ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించినట్లు హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ తెలిపారు. పాపను అపహరించిన దంపతులను అప్జల్​గంజ్ పోలీసులు అరెస్ట్​ చేసినట్లు వెల్లడించారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించామన్నారు.

​ఏపీలోని కర్నూల్​ జిల్లా ఆదోని నాగలాపురంకు చెందిన జయలక్ష్మి, రామాంజనేయులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్​ కొండాపూర్​లో నివాసం ఉంటున్నారు. ఈనెల 14న జయలక్ష్మి.. తన బంధువులైన లక్ష్మి, నాగార్జునతో కలిసి బళ్లారి వెళ్లేందుకు ఎంజీబీఎస్​కు వెళ్లారు. లక్ష్మి, నాగార్జున మధ్య ఊరు వెళ్లే విషయంలో వాగ్వాదం చోటు చేసుకోవడం వల్ల నాగార్జున బస్సు దిగాడు. 10 నిమిషాల తర్వాత జయలక్ష్మి, లక్ష్మి కూడా బస్సు దిగారు. కాసేపటికే మూడేళ్ల కుమార్తె కనిపించడం లేదని గుర్తించారు. అప్జల్ గంజ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

అంజనీకుమార్​, హైదరాబాద్​ సీపీ.

కిడ్నాపైన మూడేళ్ల పాప ఆచూకీ లభ్యం.. ఎందుకు అపహరించారంటే..

బాధితుల ఫిర్యాదులో అప్రమత్తమైన పోలీసులు ఏడు బృందాలను ఏర్పాటుచేశారు. సీసీ కెమెరా దృశ్యాల ద్వారా పాపను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. నాగర్ కర్నూల్ జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్లికి చెందిన శివుడు, పార్వతమ్మ దంపతులు పాపను అపహరించినట్లు గుర్తించారు. పెళ్లై ఆరు సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టకపోవడం వల్లే అపహరణకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారని సీసీ తెలిపారు. శివుడిపై గతంలోనూ 4 దొంగతనం కేసులున్నాయని వెల్లడించారు. పాప ఆచూకీని ఛేదించిన పోలీసులను అభినందించిన సీపీ... వారికి రివార్డులు అందించారు.

ఇవీచూడండి:'కిడ్నాప్' కలకలం: బాధితుడి వాదన ఒకటి.. పోలీసుల వాదన మరొకటి!

ABOUT THE AUTHOR

...view details