దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతున్న నేరగాడిపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పీడీ చట్టం నమోదు చేశారు. అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురానాహవేలి ప్రాంతంలో నివసించే సయ్యద్ ఫయాజ్ ఇమ్రాన్ దోపిడీ, దొంగతనాలు చేసేవాడు. పలుమార్లు అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ అతనిలో మార్పు రాకపోవడం వల్ల పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఫయాజ్‌పై పీడీ చట్టం నమోదు చేశారు.
దోపిడీ, దొంగతనాలు చేస్తున్న నేరగాడిపై పీడీ యాక్ట్ - సీపీ అంజనీ కుమార్ తాజా వార్తలు పురానిహవేలి
ఎంత చెప్పినా తీరు మార్చుకోని నేరగాళ్లపై పోలీసులు పీడీ చట్టం నమోదు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ పురానాహవేలి ప్రాంతంలో నివసించే సయ్యద్ ఫయాజ్ ఇమ్రాన్‌పై నగర సీపీ అంజనీ కుమార్ పీడీ యాక్ట్ నమోదు చేశారు.
![దోపిడీ, దొంగతనాలు చేస్తున్న నేరగాడిపై పీడీ యాక్ట్ దోపిడీ, దొంగతనాలు చేస్తున్న నేరగాడిపై పీడీ యాక్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9074506-239-9074506-1601992501969.jpg)
దోపిడీ, దొంగతనాలు చేస్తున్న నేరగాడిపై పీడీ యాక్ట్
దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. తీరు మార్చుకోని నేరగాళ్లపై పీడీ చట్టం నమోదు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండి:'మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటే పీడీ యాక్ట్ నమోదు'